ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం

Share this:

నిజామాబాద్(V3News): నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో బుధవారం జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ అబ్బ చిరంజీవి ఎన్ ఎస్ ఎస్ యూనిట్ I, యూనిట్ II లకు చెందిన ప్రోగ్రాం అధ్యాపకులు లు వి కృష్ణదాస్ సాయి కుమార్ వాలెంటర్ లతో సంతోష్ నగర్ తాండ కుప్కల్ గ్రామంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరంలో కళాశాల ప్రిన్సిపాల్ అబ్బా చిరంజీవి ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెండోరోజు కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరానికి కళాశాల ప్రిన్సిపాల్ చిరంజీవి మాట్లాడుతూ… రెండవ రోజు కొనసాగుతున్న జాతీయ సేవా పథకం కార్యక్రమం ద్వారా వాలంటీర్లతో క్రమశిక్షణతో పాటు ప్రజలకు ఎలాసేవ లను అందించాలో వివరిస్తూ జీవనంలో సేవను అలవాటు చేసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణలో ఉన్న పరిశుభ్రం చేస్తూ చెట్లకు నీళ్లు పోశారు రోడ్డును ఏడ్చారు చుట్టు పక్కన ఉన్నటువంటి చెట్లను తొలగించడం జరిగింది. అలాగే మహాత్మాగాంధీ విగ్రహానికి విద్యార్థిని విద్యార్థులు శుభ్ర పరిచారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని రెండో రోజు విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply