ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మెడిసిన్ లో సీట్ సాధించిన విద్యార్థులను ఘనంగా సత్కరించిన ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతం

Share this:

ఖమ్మం(V3 News): నీట్ లో సీట్ సాధించిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ పరిధిలో 6 గురు విద్యార్థుల కు కల్లూరు లోని తెలంగాణ గ్రామార్ హైస్కూల్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గౌతం మరియు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యి మెడిసిన్ లో సీట్ సాధించిన విద్యార్థులను శాలువా కప్పి సత్కరించారు.అదేవిధంగా దాతలు అందించిన ఆర్థిక సహాయాన్ని కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు ఎమ్మెల్యే అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గౌతం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశలల్లో,కళాశాల లలో చదువుకుని మెడిసిన్ లో సీట్ సాధించటం అభినందనీయం అన్నారు.విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో,కళాశాలల్లో విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి విద్యను అభ్యసించాలని కోరుకున్నారు.అనంతరం చెన్నూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

Leave a Reply