ప్రోద్ధు ప్రోద్ధునె ప్రోద్ధుతీరుగుడు పంట అందాలు సూపర్…

Share this:

  • వరి వద్దన్నకా ప్రత్యామ్నాయ పంటగాకొన్ని చోట్ల పొద్దుతిరుగుడు..

శితకాలం నవంబర్ మాసంలో వేసిన ప్రొద్దుతిరుగుడు పంటలు చిగురించి సూర్య కిరణాలువైపుమల్లే ఈ మొక్కలు గల పంట పొలాలు పొద్దు పొద్దున్నే రోడ్డుపై ఆటువైపు వెళ్ళే ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. సెల్ఫీలకుఅడ్డాగా మారి ఆహ్లాదాన్ని పంచుతుంది.ప్రభుత్వాలు వరి వద్దన్నాక కొన్ని కొన్ని చోట్ల కొందరు రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఎంచుకుంటున్నారు. ముధోల్ తాలూకాలో చాలాచోట్ల కనుమరుగవుతూన్న ప్రొద్దుతిరుగుడు పంట ఈమధ్య కొన్నిచోట్ల దర్శనమిస్తూ0ది.సాధారణంగా నూనెగింజలు పండించే పంటలలో వేరుశనగ మొదటిది కాగా తర్వాతి పంట ప్రొద్దుతిరుగుడు పంట.అన్ని కాలాలలో పండించే అనుకూలతలు ఉన్నా కొన్ని అననుకూలత కారణాల వల్ల ఈమధ్య పంట పండించే వారే కరువయ్యారు.ప్రభుత్వాలు వరి వద్దన్నాక రబీపంట సీజన్లో ప్రత్యామ్నాయంగా తాలూకా లో అక్కడక్కడ ప్రొద్దుతిరుగుడు పంటను సాగు చేస్తున్నారు.హృదయ సంబంధిత వ్యాధులను దృష్టిలో ఉంచుకొని చాలా మంది ప్రజలు కొలెస్ట్రాల్ తక్కువగా గల పొద్దుతిరుగుడు నూనెనే వాడగా మార్కెట్ లో మంచి డిమాండ్ నె కనబరుస్తూ0ది.ఈ మూడు నెలల పంటను పక్షుల బెడద నుండి కాపాడుకోగలిగితే అధిక లాభాలను ఆశించవచ్చని పంటనిపుణులు ఈ పంట వేసే రైతులకు తెలుపుతున్నారు.

Leave a Reply