ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలి

Share this:

నిర్మల్( వి౩ న్యూస్ ): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ ను విధుల్లో తీసుకోవాలని తాలూకా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం ఆధ్వర్యంలో శనివారం ముధోల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవో సురేష్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 2006 నుండి 2020 సంవత్సరాలుగా ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లుగా ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పిస్తూ 15 సంవత్సరాలు గడిచి పోయిన, 4779 జీవో నెంబర్ కు నిరసనగా తొమ్మిది రోజులు సమ్మె కారణంగా ప్రభుత్వం క్షేత్ర సహాయకులకు తొలగించడం జరిగింది. 15 సంవత్సరాలు పని చేస్తూ మా యొక్క వయసు 40 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాల వరకు కావడము జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఇంటర్ డిగ్రీ పీజీ చేసి కూడా ఏ జాబ్ కు అర్హత కాకుండా పోయాము ఎందుకు మాకు ఎంఐసి లో మా పేరును రోజ్ గార్ సేవకులు గా నియమించాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి రాములు, బాసర మండల అధ్యక్షుడు జనార్ధన్, లోకేశ్వరం మండల అధ్యక్షుడు సాయినాథ్, ముధోల్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్,తానూర్ మండల అధ్యక్షుడు పోతన్న, కుంటాల మండల అధ్యక్షుడు రామ్ దాస్, ఫీల్డ్ అసిస్టెంట్లు సోనీ,విట్టల్,బాలాజీ ,పోతన్న, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply