బతుకమ్మ ఏర్పాట్ల పరిశీలన

Share this:

సికింద్రాబాద్: ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా జరుపుకునే విధంగా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. మంగళవారం నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానం ఘాట్ వద్ద బతుకమ్మ ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. 13 వ తేదీన సద్దుల బతుకమ్మ సందర్భంగా అంబేడ్కర్ నగర్, కర్బలా మైదానం, PV ఘాట్ లలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తారని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ సందర్భంగా మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా వాహనాల దారి మళ్ళించాలని ట్రాపిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా విద్యుత్ లైట్ల ను ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. బతుకమ్మ వేడుకల వద్దకు వచ్చే వారికి పంపిణీ చేసేందుకు వాటర్ ప్యాకెట్ లను అందుబాటులో ఉంచాలని వాటర్ వర్క్స్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలతో ప్రభుత్వం బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అంతేకాకుండా బతుకమ్మ కానుకగా బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణా సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నేడు దేశ విదేశాలలో ఎంతో గొప్పగా నిర్వహిస్తుండటం తో విశ్వవ్యాప్తం అయిందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రజలు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారని అన్నారు. మంత్రి వెంట HMDA CE BLN రెడ్డి, CE శంకర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ GM రమణారెడ్డి, R&B EE రవీంద్ర మోహన్, ట్రాపిక్ CI ముత్తు, రాం గోపాల్ పేట CI సైదులు, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply