బలవంతపు ఓ టి ఎస్ విధానాన్ని రద్దు చేయాలి- దేవనకొండ టిడిపి

Share this:

దేవనకొండ మండలం టిడిపి కమిటీ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆదేశాల మేరకు…
జగన్ ప్రభుత్వం ఓ టి ఎస్ పేరుతో పేదలస్థలాలు,ఇళ్ళు రిజిస్ట్రేషన్ అని 10వేల రూపాయలు వసూలు చేయడం చాలా దుర్మార్గపు చర్య అని దేవనకొండ మండలం టిడిపి నాయకులు ఓ టి ఎస్ కు వ్యతిరేకంగా భారీఎత్తున ర్యాలీ నిర్వహించి అందరూ ఎంపీడీవో ఆఫీసుకు వెళ్లి ఓ టి ఎస్ ను రద్దుచేయాలని ఎంపీడీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే టిడిపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలు మెడకు ఉరి తాళ్ళు గా మారిన ఓ టి ఎస్ వసూళ్ల . రేపు జరగబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మొట్టమొదటి సంతకమే చంద్రబాబు నాయుడు ఓ టి ఎస్ ఫైల్ పైన చేస్తారు అని మండల నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ విజయ భాస్కర్ గౌడ్ , బడి గింజల రంగన్న, ఉచ్చిరప్ప, మాలిక్ భాష ,డీలర్ బండ్లలయ్య, ఆకులు వీరేష్, రామారావునాయుడు, మల్లయ్య , సర్పంచ్ భాస్కర్, సర్పంచ్ హనుమంతు, పొట్లపాడు సుధాకర్, మస్తాన్, మల్లికార్జున్ గౌడ్, సుంకన్న ,రాజశేఖర్ గౌడ్ , సర్పంచ్ నాగరాజు గౌడ్, సర్పంచ్ చిన్న రామప్ప, MPTC తిమ్మప్ప, సుల్తాను, గిడ్డయ్యా గౌడ్,కృష్ణ, నాగేశ్వరరావు, సురేష్, నాగేష్, సర్పంచ్ బాలకృష్ణ, ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave a Reply