బాన్సువాడ పట్టణంలో రైతు మహా ధర్నా

Share this:

కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం” కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ పట్టణంలో రైతు మహా ధర్నా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో లో మీ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ మేరకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, తెరాస శ్రేణులు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యాసంగి సీజన్ లో వరి ధాన్యాన్ని యధావిధిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉద్యమ నేత సీఎం కేసీఆర్ నిరంతరం రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆంక్షలు విధించడం శోచనీయమని అన్నారు. TRS పార్టీ ఉద్యమాలు కొత్త కాదని, ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో సాధించుకున్న రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు దిక్సుచిగా విలుస్తుందని, ముఖ్యంగా రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా, విత్తనాలు, ఎరువులు, 24 గంటల ఉచిత కరెంటుతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టుతో బీడు భూములకు నీళ్లు మల్లుతున్నాయని. పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు విక్రయిస్తే పీడీ ఆక్ట్ పెట్టి జైలుకు పంపుతున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రం చివరి ముఖ్యమంత్రి తెలంగాణ వస్తే అంధకారం అవుతుందని ఎద్దేవా చేసారని, కేసీఆర్ పాలనలో మన రాష్ట్రంలో గృహ అవసరాలకు, పరిశ్రమలకు, రైతులకు 24 గంటల కరెంట్ ను ఇస్తున్నారని తెలిపారు.పచ్చని పైరు గాలులతో పాడి పరిశ్రమలతో తెలంగాణ రాష్ట్రం ముందుకు వెళ్తుందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులపై వివక్ష చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం: కొనుగోళ్లపై విధించిన ఆంక్షలను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయమని కేంద్రం అంటుంటే, లోకల్ బీజేపీ నాయకులు కనీస అవగాహన లేకుండా. అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపిటిసిలు సర్పంచ్లు కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply