బాపట్లలో భారతరత్న శ్రీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి

Share this:

గుంటూరు జిల్లా బాపట్లలో భారతదేశ ముద్దుబిడ్డ, రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి భారతరత్న శ్రీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి 65 వ వర్ధంతి సందర్బంగా వైయస్సార్సీపీ యూత్ నాయకులు రైల్వేస్టేషన్ దగ్గర వున్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వైయస్సార్సీపీ యూత్ నాయకులు జోగిరాజా మాట్లాడుతూ అణగారిన బడుగు బలహీనవర్గాల ప్రజలకు అండగా నిలిచి సామాజిక అసమానతలను అంటరానితనాన్ని రూపుమాపి సమసమాజ స్ధాపన కోసం కృషిచేశారని అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు
వారి ఆశయాలను కొనసాగిస్తూ బడుగు బలహీనవర్గాలు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ ల పేదప్రజలకు అండగా నిలిచి వారి సంక్షేమాభివృద్ధికి కృషిచేస్తున్నారని అన్నారు.భావితరాల వారికి ప్రతిఒక్కరూ కూడా స్ఫూర్తిని అందించాలని కోరుకుంటూ మేమంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతికి జోహార్లు ఘననివాళులు అర్పిస్తున్నామని ఈ సందర్భంగా వైయస్సార్సీపీ యూత్ నాయకులు ముప్పిరి రాజశేఖర్ విలేఖరులతో మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ యూత్ నాయకులు జోగి రాజా,అడే క్యాత్రిన్ రాజు,ముప్పిరి రాజశేఖర్,అడే చందు,తురిమెళ్ళ అమ్మేశ్వరరావు,తానికొండ ఆనంద్ బాబు,కె.డానియల్,కత్తి జాన్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply