బాపట్లలో శ్రీ ఉమా సుధీర్ క్లినిక్ డెంటల్ క్యాంపు

Share this:

గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ ఉమా సుధీర్ క్లినిక్ వారి సౌజన్యంతో చంద్రాస్ డెంటల్ ను స్థాపించి బాపట్ల లోని ప్రజలందరికీ అందుబాటుగా బాపట్ల ఏరియా హాస్పిటల్ ప్రక్కనే వైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని ఎంఎస్ సాప్ట్వేర్ సంస్ధ అధినేత శేషుకృష్ణ విలేఖరుల తెలిపారు.నేను చదువుకున్న ఎ.వి.వి.ఉన్నత పాఠశాలలో నా కోరికమేరకు డెంటల్ క్లినిక్ క్యాంపు కార్యక్రమం నిర్వహించి విద్యార్ధులకు ఫ్రీ ఓపీతో,ఫ్రీ చెకప్ చేసి‌ ఫ్రీగా టూత్ పెస్టులు అందజేసినందుకు డాక్టర్ యామినీ చంద్ర దంపతులకు శేషుకృష్ణ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశారు.బాపట్ల ప్రాంత వాసిగా ప్రజలకు ఎంతో కొంత సేవచేయాలనే మంచి తలంపుతో చంద్రాస్ డెంటల్ క్లినిక్ ను ఏర్పాటు చేసి విద్యార్ధులకు వైద్య సేవలను అందించటం నిజంగా చాలా గర్వంగా ఉందని శేషుకృష్ణ ఆనందం వ్యక్తపరిచారు. ప్రజలకు తక్కువ కన్సల్టెన్షన్ ఫీజు తోనే ఈ చంద్రాస్ డెంటల్ క్లినిక్ లో వైద్యసేవలు అందిస్తున్నారని ఈ సందర్భంగా శేషుకృష్ణ విలేఖరులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ యామినీ చంద్ర దంపతులు,వైద్య సిబ్బంది మరియు ఉపాధ్యాయులు,విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave a Reply