బాపట్లలో సువార్తికుల సెమీ క్రిస్మస్ వేడుకలు

Share this:

గుంటూరు జిల్లా బాపట్లలోని CBZ చర్చి ప్రాంగణంలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సహకారంతో వైయస్సార్సీపీ నాయకులు చల్లా రామయ్య ఆధ్వర్యంలో సువార్తికుల సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొని కేక్ కటింగ్ చేసి సువార్తికులకు‌ మరియు దైవజనులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి మనం పూర్తిగా కోలుకున్న తర్వాత సెమీ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవటం చాలా ఆనందంగా వుందని అన్నారు.ఏసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెనని చెప్పినట్లుగా మనందరం కూడా ఆప్యాయతలతో ప్రేమానురాగాలతో ఒకరుకొకరు కలిసి ఐక్యంతో వుండాలని కోరుకుంటున్నానని అన్నారు.అలాగే సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించిన చల్లా రామయ్య ను అభినందించారు.అనంతరం సువార్తికుల కు డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తన చేతులమీదుగా దుప్పట్లు ను,కానుకలను అందజేశారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు చేజేర్ల నారాయణరెడ్డి,ముప్పిరి రాజశేఖర్,వడ్డెముక్కల డేవిడ్,జోగి రాజా, కొక్కిలిగడ్డ చెంచయ్య,బీసీ సంఘ రాష్ట్ర నాయకులు ఉప్పాల మురళీ మరియు సువార్తికులు పాల్గొన్నారు.

Leave a Reply