బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ వేగేశన నరేంద్రవర్మ గౌరవ సభ

Share this:

గుంటూరు జిల్లా బాపట్లలోని జమ్ములపాలెం ఫ్లై ఓవర్ బ్రిడ్జి దగ్గర వున్న ఎం.ఎస్.ఆర్ కళ్యాణ మండపము వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ వేగేశన నరేంద్రవర్మ గౌరవ సభ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రజాసమస్యలపై 16 అంశాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందజేశారు.ఈ గౌరవ సభా కార్యక్రమంలో వేగేశన నరేంద్రవర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ప్రపంచ దేశాలలో తెలుగువారి ఖ్యాతిని పెంచింది తెలుగుదేశం ఒకటేనని అన్నారు.ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మహిళలకి అన్యాయం జరిగితే ఒక్క నిమిషంలో ఉంటాం అన్న ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల మీద దాడులు జరుగుతుంటే ఏమి చేస్తుందని అన్నారు.
ఒక్క ఛాన్స్ తో రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం నాశనం చేసేసిందని వేగేశన నరేంద్రవర్మ ఆరోపించారు.రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ప్రజలను కోరుతూ మా పార్టీ అందరికీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా వేగేశన నరేంద్రవర్మ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కమిటీ నాయకులు,పార్లమెంటు నాయకులు,పట్టణ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply