బాపట్ల లో కోటి దీపోత్సవం పూజా కార్యక్రమం

Share this:

గుంటూరు జిల్లా బాపట్ల లో శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో సప్తమి శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని కోటి సోమవారం పూజా కార్యక్రమం నిర్వహించామని శ్రీ సంపత్ గణపతి పరివార్ నిర్వాహకులు బాబూ నాగేంద్ర తెలిపారు. అనంతరం గోపూజ ఉత్సవము ,మహా కలశ స్థాపన, నవనాగ సహిత మానసా దేవి కి విశిష్ట పూజా కార్యక్రమం , నర్మదే శ్వర స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ వార అభిషేకం జరిగిందని అన్నారు. (కోటి దీపోత్సవం) కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించి తీర్థ ప్రసాదాలు సేకరించి భక్తులు దీప కాంతులతో శ్రీ మహాలక్ష్మికి అష్టోత్తర శత నామ పూజా కార్యక్రమం నిర్వహించటం జరిగిందని అన్నారు. శ్రీ మహర్షి ఆశ్రమం గోశాలలో ఉన్న ఉసిరి, మారేడు ,తులసి, వృక్షాలకు మహిళలు విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహించారని,ఈ సందర్భంగా బాబూ నాగేంద్ర తెలిపారు.ఈ కార్యక్రమంలో సంపత్ గణపతి పరివార్ సభ్యులు బాబు నాగేంద్ర, కన్నెగంటి సత్యనారాయణ, మల్లి శెట్టి బాలాజీ, భ్రమరాంబ దంపతులు, సాయి శ్రీ లక్ష్మీ, భారతి, భాగ్యలక్ష్మి, శ్యామల దేవి, కృష్ణారెడ్డి, వెంకటరమణ, కోట సుకన్య, అన్నపూర్ణ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

Leave a Reply