బాపట్ల వైయస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు విలేఖరుల సమావేశం

Share this:

గుంటూరు జిల్లా బాపట్లలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సూచనలమేరకు వైయస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశరావు విలేఖరులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నరాలశెట్టి ప్రకాశరావు విలేఖరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదప్రజలకు ఇచ్చిన 33 లక్షల ఇళ్ళ పట్టాలను అడ్డుకుని కోర్టుకు వెళ్ళటం హేయమైన చర్య అని అన్నారు. కోర్టు మాత్రం పేదలకు ఇళ్ళు నిర్మించుకునేందుకు అవకాశం ఇస్తూ తీర్పు ఇవ్వటాన్ని హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి బాపట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.బాపట్ల లో మూడు ప్రాంతాలలో పేదప్రజలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు కృషిచేస్తుండటం అభినందనీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఇనుగలూరి మాల్యాద్రి,సయ్యద్ పీర్, సి.కె.నాయుడు,చల్లా రామయ్య, ఆవుల నరేష్ కుమార్ యాదవ్,అడే క్యాత్రిన్ రాజు,షేక్ అఫ్జల్,నక్కా వీరారెడ్డి,మేడిబోయిన బ్రహ్మారెడ్డి తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply