బాబా మినీ ఏసీ ఫంక్షన్ హాల్ ప్రారంభించిన దాస్యం వినయ్ భాస్కర్

Share this:

కాజిపేట ఫాతిమా జంక్షన్లో నిర్వాహకులు టీఆరెస్ 61 డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు బాబా సర్వర్ పాషా నూతనంగా నిర్మించిన బాబా మినీ ఏసీ ఫంక్షన్ హాల్ ను ముఖ్య అతిధులుగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్,నగర మేయర్ గుండు సుధారాణి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు బాబా సర్వర్ పాషా మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా కాజిపేటలో బాబా టెంట్ హౌజ్ నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించినట్లు తెలిపారు.కాజిపేట,ఫాతిమా ప్రజలకు మరింత సేవ చేయడానికి అతి తక్కువ ధరల్లో సేవలందించడానికి బాబా మినీ ఏసీ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించినట్లు నిర్వాహకులు బాబా సర్వర్ పాషా తెలిపారు.ఈ అవకాశాన్ని కాజిపేట,ఫాతిమా నగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు బాబా సర్వర్ పాషా తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక 49 వ డివిజన్ కార్పొరేటర్ ఏనుగుల మానస రాం ప్రసాద్,61వ డివిజన్ కార్పొరేటర్ ఎలకంటి రాములు,60వ డివిజన్ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్,పీఠాధిపతి ఖుస్రూ పాషా,సిరిల్ లారెన్స్, కోటిలింగం,బంధుమిత్రులు,తదితరులు హాజరయ్యారు.

Leave a Reply