బాల రక్షక్ వాహనాల ప్రారంభం

Share this:

ఆపదలో ఉన్న బాలల రక్షణ కోసమే బాల రక్షక్ వాహనాల ఏర్పాటు చేయడం జరిగింది అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద రెండు బాల రక్షక్ వాహనాలను ప్రారంభించిన మంత్రి తలసాని, కలెక్టర్ శర్మన్ ఆపదలో ఉన్న బాలల కోసం తెలంగాణ ప్రభుత్వం 1098 హెల్ప్ లైన్, జిల్లాకు ఒకటి చొప్పున బాలరాక్షక్ వాహనాలను ఏర్పాటు చేసింది.హైదరాబాద్ జిల్లాకు రెండు వాహనాలను కేటాయించగా, నేడు ప్రారంభించడం జరిగింది.అనాధ బాలలు, భిక్షాటన చేస్తూ 18 సంవత్సరాల లోపు పిల్లలు ఎక్కడ కనిపించినా బాల్య వివాహం జరుగుతున్నా కానీ 1098 హెల్ప్ లైన్ కు కాల్ చేస్తే బాల రక్షక్ వాహనం అక్కడికి సకాలంలో చేరుకొంటుంది…మంత్రి తలసాని

హెల్ప్ లైన్ కు కాల్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి ప్రొటెక్షన్ ఆఫీసర్, జిల్లా బాలల సంరక్షణ యూనిట్ అధికారులు బాలరాక్షక్ వాహనం తో చేరుకుంటారు. పరిస్థితులను బట్టి పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సహకారం తీసుకోవడం జరుగుతుంది.మహిళా శిశుసంక్షేమ శాఖ పర్యవేక్షణలో బాల రక్షక్ వాహనాలు నిర్వహించబడతాయి.బాల రక్షక్ వాహనం ద్వారా తీసుకొచ్చిన బాలల సంరక్షణ కోసం బాల సదన్ లో చేర్పించడం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికల సంరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుంది

Leave a Reply