బిజెపి తలపెట్టిన నిరుద్యోగ దీక్ష ను విజయవంతం చేయండి

Share this:

మర్పల్లి: భారతీయ జనతా పార్టీ మర్పల్లి మండల కార్యాలయం లో మండల అద్యక్షులు మల్లేష్ యదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 27 న ఇందిరాపార్కు దగ్గర భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు తల పెట్టిన నిరుద్యోగ దీక్ష ను నిరుద్యోగ యువత అదిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండ నిరుద్యోగ యువకుల ఆత్మహత్య లకు కారణమవుతుంది అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వేంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైయం ప్రాధాన కార్యదర్శి పసుల మహేష్, బిజెవైయం మండల అద్యక్షుడు శ్రీమంత్ కుమార్, నాగేష్,వేంకటష్,సుభాష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply