బిటిపిఎస్ భునిర్వాసితుల ఆందోళన….

Share this:

మణుగూరు(V3News): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామనుజవరం వద్ద బారి పోలీసు బలగాల సహాయంతో జెన్కో అధికారులు రైతుల భూముల్లోకి రంగప్రవేశం చేయడంతో రైతులకు అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బిటిపిఎస్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు సరఫరా కొరకు రైల్వే లైన్ పనులు మొదలుపెట్టారు జెన్కో అధికారులు. రైల్వే లైన్ వేసేందుకు అవసరమైన భూమి నిర్వాసితుల నుండి తీసుకొని వారికి నష్టపరిహారం చెల్లించకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. రైతులు తమ పొలాల్లో వేసుకున్న పంటలను జెన్కో అధికారులు జేసిబిలతో ధ్వసం చేస్తుండగా గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. అధికారులకు రైతులకు మధ్య జరిగిన తోపులాటలో మహిళా రైతు స్పృహ కోల్పోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిహారం చెల్లించకుండా మా భూములు ఎలా స్వాధీనం చేసుకుంటారని రైతులు ఆందోళన చేస్తున్న క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు అన్యాయంగా అన్నదాతలను అరెస్ట్ చేశారు.

Leave a Reply