బోనం ఎత్తిన తురుకపల్లి

Share this:

రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్ మండలం తురుకపల్లి గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సర్పంచ్ కాసోళ్ల పద్మ దుర్గాప్రసాద్ నేతృత్వంలో ప్రతి ఐదు సంవత్సరాల ఒకసారి జరుపుకునే గ్రామ దేవతలు పోచమ్మ ,మైసమ్మ పండుగలు ఘనంగా నిర్వహించారు.గ్రామంలో ప్రతి ఇంటిలో మహిళలు కొత్త కుండ లో అన్నం వండి కుంకుమ పసుపు లు పూసి బోననాన్ని అలంకరించి ఊరేగింపు గా శివ సత్తుల పూనకలు,బై0డ్ల వారి విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ మహిళలు చిన్నారులు బోనాలతో ఊరేగింపు గా తరలి వెళ్లి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి,కుండలో తీసుకువచ్చిన ప్రసాదాన్ని అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.గ్రామ దేవతల కోసం పెంచిన కోడి పుంజులు,గొర్రెలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామములో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాసోళ్ల పద్మ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గ్రామములో తమ కుటుంబాలను గ్రామ దేవతలు సల్లగా చూడాలని,ఆయుఆరోగ్యాలు కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాల ను గడ గడ లాడిస్తున్న మహమ్మరి కరోన, ఓమి క్రాన్ వైదొలుగా లని వేడుకున్నట్లు తెలిపారు. బంధువుల రాకతో గ్రామంలో పండగ వాతావరణం లో ఆనందంగా గడిపారు.

Leave a Reply