భారత స్వాతంత్ర ఉద్యమ కారుడు

Share this:

షాద్ నగర్లో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.

షాద్ నగర్(V3News)05-04-2022: జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా ఫారూఖ్ నగర్ ఎంపీడీఓ కార్యలయంలో బాబు జగ్జివన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఆంజయ్య యాదవ్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,,, స్వాతంత్య్ర సమరయోధుడిగా,సంఘసంస్కర్తగా తన పరిపాలనా దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన గొప్ప యోధుడు బాబు జగ్జివన్ రామ్ అని అన్నారు.ఎంపిగా , కేంద్ర మంత్రిగా , ఉప ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు.పేద దళిత కుటుంబంలో పుట్టి బడుగు బలహీన వర్గాల హక్కుల సాధనకై పోరాడిన సంఘ సంస్కర్త భారతదేశ దళిత తొలి ఉప ప్రధాని భారత స్వాతంత్ర పోరాటంలో తమదైన పాత్ర పోషించి, సమాజ సమానత్వాన్నికై పాటుపడిన వ్యక్తి అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మండలంలోని యం పి పి,పి ఏ సి యస్ చైర్మన్ డైరెక్టర్లు అన్ని గ్రామాల తెరాస పార్టీ గ్రామకమిటి అధ్యక్షులు ,మండల సర్పంచులు ,మండల ఎం పి టి సి లు ,మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు, గ్రంథాలయ చైర్మన్ డైరెక్టర్లు డిప్యూటీ సర్పంచులు ముఖ్య కార్యకర్తలు వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply