భువనగిరిలో కిడ్నాప్ కథ విషాదం…

Share this:

రామకృష్ణను హతమార్చిన దుండగులు…

రామకృష్ణది పరువు హత్యా ?

ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమా ?

భువనగిరి(v3news): 17-04-2022: యాదాద్రి భువనగిరి జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది.నిన్న భువనగిరిలో కిడ్నాప్ కు గురైన రామకృష్ణ నేడు సిద్దిపేట జిల్లాలో శవమై తేలాడు.వలిగొండ (మం)లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ, భార్గవిని 2020 లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.ప్రస్తుతం దంపతులు భువనగిరిలో నివాసముంటున్నారు. గతంలో హోంగార్డుగా పనిచేసిన రామకృష్ణ,గుప్తనిధుల తొవ్వకాలు జరిపి సస్పెన్షన్ కు గురయ్యాడు.అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

కాగా నిన్న లతీఫ్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా, తనకు ల్యాండ్ చూయించాలంటూ రామకృష్ణకు మాయమాటలు చెప్పి కారులో తీసుకెళ్లాడని భార్గవి భువనగిరి టౌన్ పీఎస్ లో పిర్యాదు చేసింది.ప్రస్తుతం కేసు విచారణలో ఉండగానే రామకృష్ణ హత్య కలకలం రేపుతోంది.సిద్దిపేట జిల్లాలో రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు.అయితే రామకృష్ణ లవ్ మ్యారేజ్ అనంతరం ఇరు కుటుంబాలకు గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఆ గొడవల నేపధ్యంలోనే రామకృష్ణను హతమార్చినట్టు సమాచారం.

ఇదిలా ఉండగా అసలు రామకృష్ణకు లతీఫ్ కు సంబంధం ఏంటీ ? హాత్యకు రియల్ ఎస్టేట్ లావాదేవీలేమైనా కారణమై ఉండొచ్చా ? ప్రేమ పెళ్లి చేసుకున్నారన్న కక్షతో అమ్మాయి కుటుంబ సభ్యులు సుఫారీ గ్యా౦గ్ సహాయంతో రామకృష్ణను ఖతం చేసి ఉంటారా ? రామకృష్ణను భువనగిరిలో హత్య చేసి సిద్దిపేటలో పడేసారా ? లేదంటే హంతకులు రామకృష్ణని సిద్దిపేట జిల్లాలోనే హత్య చేసి…కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారా ? ఈ అనుమానాలే ఇటు సిద్దిపేట జిల్లా పోలీసులకు మరియు యాదాద్రి పోలీసులకు తలెత్తున్నాయి.కాగా ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతమయ్యింది.హాంతకుల కోసం పోలీసుల గాలింపు ముమ్మరంగా సాగుతోంది.

Leave a Reply