మన్సూరాబాద్ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డిపై కేసు నమోదు

Share this:

మన్సూరాబాద్ కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్బీనగర్ పీఎస్‌లో కార్పొరేటర్‌ కొప్పుల నర్సింహారెడ్డిపై కేసు నమోదైంది. పోలీసులపై దాడులు చేయాలని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారని ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. పశ్చిమబెంగాల్‌ విధ్వంసం వీడియోలను నర్సింహారెడ్డి పోస్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. విధ్వంసాలను ప్రేరేపించారని అభియోగాల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.