మలేషియా సముద్రం తీరం లో తుంగతుర్తి యువకుడు గల్లంతు

Share this:

నల్గొండ జిల్లా కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామం నికి చెందిన యువకుడు మలేషియా సముద్రం తీరంలో గల్లంతయ్యారు తల్లిదండ్రుల కథనం ప్రకారం తుంగతుర్తి కి చెందిన మోట కట్ల వెంకటరమణ రెడ్డి ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ సూర్యాపేటలో నివాసం ఉంటున్నారు అతని పెద్ద కుమారుడు రిషి వర్ధన్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరిలో కేరళలోని మత్స్య న్ నేవీ సంస్థలో పోస్టు గాడ్ ఉద్యోగంలో చేరి మలేషియా వెళ్ళారు సోమవారం ఉదయం రిషి వర్ధన్ రెడ్డి (21) విధులు నిర్వహిస్తున్న ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయినట్లు మలేషియా మత్స్య న్ నేవీ ఫిష్ కెప్టెన్ తమకు సమాచారం అందించారని వెంకటరమణ రెడ్డి తెలిపారు కుమారుడి మిత్రులను వాకబు చేయగా 5 గంటల ప్రాంతంలో రిషి వర్ధన్ రెడ్డి పడిపోయాడని వెంటనే గాలింపు చేపట్టారు ఆచూకీ లభించలేదు అని అని వివరించినట్లు చెప్పారు ఈ ప్రకటనతో తల్లిదండ్రులు బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు.

Leave a Reply