మహాబతుకమ్మ ఉత్సవాలు – 2021

Share this:

జగిత్యాల : తెలంగాణ ఖ్యాతిని సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తు నిర్వహించుకుంటున్న బతుకమ్మ పండుగ వేడుకలను జగిత్యాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మహాబతుకమ్మ ఉత్సవాలు – 2021 ఘనంగా నిర్వహించడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీ అద్వర్యంలో 16ఫీట్లతో కూడిన బారిబతుకమ్మతో వైశ్యాభవన్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు శోభాయాత్రను నిర్వహించారు. అనంతరం బతుకమ్మ ఆటను అడుతు జగిత్యాల జిల్లా కేంద్రంలో ముందుగానే సద్దుల బతుకమ్మ పండుగ వచ్చిందా అనేవిధంగా జిల్లా నలుమూల పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణి, జిల్లా కలెక్టర్ దంపతులు, మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, జగిత్యాల ఆర్డిఓ అర్.డి. మాదురి, పలువులు ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, ఉద్యోగులు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

Leave a Reply