మాకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయండి ఎస్టీ కులాల యానాదులు వినతి పత్రం

Share this:

కొన్ని ఏళ్లుగా మేము అదే స్థలంలో ఉన్నాము మాకు న్యాయం చేయండి

సిద్ధవటం: కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంసిద్ధవటం మండలం ఎస్ రాజంపేట మెట్ట ప్రాంతం నందు మాకు గృహాలు లేని వల్ల మేము గుడారాలు వేసుకొని అక్కడే జీవనం సాగిస్తున్నామని మాకు ఏ ఆధారం లేదు రెక్కాడితే డొక్కాడని కుటుంబం లో ఉన్నాము మాకు ప్రభుత్వం నుండి ఎటువంటి గృహాలు మంజూరు కాలేదు మాకు స్థలాలు లేవు అని ఈరోజు సోమవారం సుమారు 20 మంది మండల రెవెన్యూ కార్యాలయం నందు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు

డిప్యూటీ తాసిల్దారు వివరణ

సంబంధిత అర్జీలు మండల తాసిల్దార్ కు పంపిస్తాను అని వివరణ ఇచ్చారు తాసిల్దారు సెలవులో ఉన్నారు తాసిల్దార్ కు వీళ్ళు ఇచ్చిన వినతి పత్రం పంపడం జరుగుతుందని డిప్యూటీ తహసీల్దార్ అనురాధ వివరణ ఇచ్చారు

Leave a Reply