మాట చెప్పే నాయకుడు కాదు ఇచ్చిన హామీలను నెరవేర్చే నాయకుడు మంత్రి జగదీష్ రెడ్డి

Share this:

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చర్చి కాంపౌండ్ కు చెందిన మొండి కత్తి వినీత్ వివాహం చేసుకున్న కొద్దీ రోజుల్లోనే విధి యాక్సిడెంట్ రూపంలో వక్రీకరించడంతో స్పైనల్ కార్డ్ దెబ్బతిని రెండు కాళ్ళు కోల్పోయి మంచానికే పరిమితం అయ్యాడు. ఈ సందర్భంగా బాధితుడు వినిత్ V3 న్యూస్ తో మాట్లాడుతూ ఇటీవల పక్క ఇంట్లో కల్యాణ లక్ష్మీ చెక్ లను అందజేయడానికి వచ్చిన మంత్రి జగదీశ్ రెడ్డి తనని గమనించి నిమ్స్ వైద్యులతో మాట్లాడి పరిస్థితిని వివరించారని తెలిపారు.వెన్నుపూస ఆపరేషన్ కు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి వైద్యులకు తెలిపారని అన్నారు.వైద్యానికి అయ్యే ఖర్చులు కూడా తామే భరిస్తామని మంత్రి భరోసా కల్పించారన్నారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ మాటలు చెప్పి పబ్బం గడిపే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజుల్లో చెప్పిన మాట ఇచ్చిన హామీని మంత్రి జగదీష్ రెడ్డి నేరవేస్తున్నారని అలాంటి నాయకుడు సూర్యాపేట నియోజకవర్గనికి దొరకడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు

Leave a Reply