మాస్కులు లేకుంటే కేసులు : సీఐ పల్లె రాకేష్

Share this:

బోధన్ , V3 న్యూస్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో పట్టణ సీఐ పల్లె రాకేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.కరోనా సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మాస్కులు ధరించాలని సూచించారు. మాస్కులు లేకుండా అనవసరంగా వాహనాలపై బయటకు వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి, వెయ్యి రూపాయలు చొప్పున జరిమానా విధిస్తామని తెలిపారు. ఈ రోజు మాస్కులు లేకుండా తిరుగుతున్న 30 వాహనాలను తనిఖీలు చేసి,జరిమానా విధించినట్లు తెలిపారు.

Leave a Reply