మాస్కు ధరించండి లేదంటే తప్పదు జరిమానా…

Share this:

వేములవాడ పట్టణ పరిధిలోని ప్రజలందరూ తప్పని సరిగా మాస్కులను ధరించాలని లేకుంటే జరిమానా కట్టాల్సి వుంటుందని ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలియజేసారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ కరోన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అధికవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ అదేశాల మేరకు వేములవాడ పట్టణ పరిధిలో బహిరంగ సమావేశాలు, ర్యాలీలు, మత, రాజకీయ , సంస్కృతిక కార్యాక్రమాలతో పాటు ఇతర సాముహిక సమావేశాలపై నిషేధాన్ని విధించడం జరిగిందని. ప్రజా రవాణా నిర్వహణ సంస్థలు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, సంస్థలు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు తప్పక మాస్కులను ధరించి, భౌతికదూరాన్ని పాటించాలని, తమ ప్రాంగణంలో తరుచుగా శానిటైజేషన్ చేయించడంతో పాటు, ఐ.ఆర్ థర్మామీటర్ల లేదా థర్మా స్కానర్లులతో ప్రవేశ మార్గం వద్ద తప్పక స్క్రీనింగ్ నిర్వహించాలని, ప్రజలు శానిటైజర్ తో చేతులు శుభ్రపర్చుకోనే సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని. అదే విధంగా విద్యా సంస్థల నిర్వహకులు తమ సంస్థల్లో సిబ్బంది మరియు విద్యార్థులు తప్పని సరిగా మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించే విధంగా ఆయా విద్యా సంస్థల యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని, కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాలని,మాస్కు ధరించకుండా ఎవరైనా రోడ్లపై తిరిగితే విపత్తు నిర్వహణ చట్టాన్ని అనుసరించి సదరు వ్యక్తులకు వేయ్యి రూపాయల జరిమానా విధించబడుతుందని.
థర్డ్ వేవ్ ప్రభావాన్ని తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని. ప్రజలు తమ వంతు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బహిరంగ ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లో, కూరగాయల మార్కెట్లలో మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా కోవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుండి 60 సెక్షను 188 ఐపీసి చట్టప్రకారం చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

Leave a Reply