మీసేవ ఉద్యోగి దారుణ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్,రెండు కత్తులు, రెండు బైకులు స్వాధీనం

Share this:

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా రామగుండం మీ సేవ కేంద్రం ఉద్యోగి కాంపెల్లి శంకర్ దారుణ హత్య సంఘటనలో ఎన్టీపీసీకి చెందిన పాయిల రాజు హతుని భార్య హేమలత ను అరెస్టు చేసినట్టు రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి రెండు కత్తులు, పగిలిన బీరు సీసా, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ మేరకు రామగుండం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25న అదృశ్యమైన కాంపల్లి శంకర్ అదేరోజు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి హతుని భార్యతో రాజు అనే యువకుని మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని తెలింది. ఈ క్రమంలోనే శంకర్- రాజుల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల కాంపల్లి శంకర్ ను రాజు ఎన్టిపిసి లో ఉన్న ఇంటికి పిలిపించుకున్నాడు. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో బీరు సీసా తో శంకర్ తలపై కొట్టి చంపాడు. శంకర్ శరీరాన్ని ఏడు ముక్కలు చేశాడు. అనంతరం వివిధ ప్రాంతాలలో శరీర భాగాలను పడవేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ అనంతరం శంకర్ శరీర అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజు తో పాటు హతుని భార్య హేమలత ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఎన్టిపిసి ధన్వంతరి హాస్పిటల్ లో స్టాఫ్ నర్సు గా పనిచేసే శంకర్ భార్యతో అదే ఆస్పత్రిలో స్వీపర్ గా పనిచేసే రాజుతో గతంలో సన్నిహిత్యం ఉండేది. ఈ క్రమంలోనే శంకర్ – రాజులకు విరోధం ఏర్పడింది. దీంతో శంకర్ ను దారుణంగా హతమార్చి డిటెక్టివ్ సినిమా మాదిరిగా శరీర అవయవాలను వివిధ ప్రాంతాల్లో వేశాడు. చివరకు రాజు, మృతుని భార్య హేమలత ను పోలీసులు కటకటాల్లోకి పంపించారు.

Leave a Reply