ముంబై అమరవీరులకు జోహార్

Share this:

భారత దేశ వ్యాపార రాజధాని అయిన ముంబై పై పాకిస్థానీ తీవ్రవాదులు దాడి చేశారు, ఈ తీవ్ర వాదులను ముంబై స్పెషల్ పోలీసులు భారత సైన్యం వీరోచితంగా పోరాడి తీవ్రవాద దాడిని తిప్పికొట్టి తీవ్రవాదులను మట్టికరిపించారు. ఈ క్రమంలో భరతమాత బిడ్డలు అసువులు బాసారు వారందరిని స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ గారు. ఆదిలాబాద్ మున్సిపల్ అఫిస్ ముందర గల అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం తమ ప్రాణాలను ఫణంగా పెట్టె సైనికులు పోలీసుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది అన్నారు.

దేశ అంతర్గత మరియు శత్రువుల నుండి నిరంతరం మనలను కాపాడే ప్రక్రియలో ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరికి అంజలి ఘటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు. పట్టణాధ్యక్షుడు లాలా మున్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆకుల ప్రవీణ్. జోగు రవి. దినేష్ మాటోలియ. భూమన్న .దయాకర్ మహేందర్ . రత్నాకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply