ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి సాగర్ ఎమ్మెల్యే భగత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసిన సెర్ఫ్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎం ఉద్యోగస్తులు

Share this:

——ఆనందోత్సవాలలో నాగార్జునసాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా సెర్ఫ్ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎం లు
నాగార్జునసాగర్(V3News): నాగార్జునసాగర్ నియోజకవర్గ వివిధ మండలాలకు చెందిన సెర్ఫ్ ఉద్యోగస్తులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఎంలు ఎమ్మెల్యే భగత్ ఆధ్వర్యంలో కెసిఆర్ కు పాలాభిషేకం చేయడం జరిగింది. ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ల యొక్క ఆర్థిక పరిస్థితులను పరిశీలించి వారిని వెంటనే విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన కెసిఆర్ గారు. చాలి చాలని జీతాలతో పనిచేస్తున్న సెర్ఫ్ మరియు ఏపీఎం ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వేతనాలు పెంచుతామని సీఎం గారు హామీ ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అధిక వేతనాలు పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 80 వేల పైచిలుకు ఉద్యోగాలు ప్రకటించిన మన నాయకుడు కెసిఆర్ గారు అని తెలియజేశారు. నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం గారి పై ప్రతిపక్షాలు విమర్శించడం మాత్రం మానుకోవడం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మలిగి రెడ్డి లింగారెడ్డి, మార్కెట్ మాజీ చైర్మన్ ఎడవెల్లి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కూరాకుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి యనమల సత్యం,మున్సిపల్ చైర్మన్ గౌరవ సలహాదారులు వెంపటి శంకరయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్ ,పట్టణ అధ్యక్షుడు చెరుపల్లి ముత్యాలు, ఇతర పలువురు నాయకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply