ముధోల్ లో కేంద్ర బృందం పర్యటన

Share this:

ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో మంగళవారం రోజున కేంద్ర బృందం సభ్యులు కిషోర్, రాకేష్ పర్యటించారు. కేంద్ర బృందం సభ్యులకు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో సురేష్ బాబు, డి ఎల్ పి ఓ శివకృష్ణ, స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్ స్వాగతం పలికి సన్మానించారు. గ్రామంలోని పలు వాడలు తిరుగుతూ ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ తోపాటు అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించారు. అదే విధంగా గ్రామంలో సేకరించిన తడి పొడి చెత్త నిర్వహణ తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు వార్డులు తిరుగుతూ పై పనులను పరిశీలించి వివరాలను అడిగి నమోదు చేసుకున్నారు. గ్రామంలో పనుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజు, ఈవో పవన్ కుమార్, వార్డు సభ్యులు, తదితరులు, పాల్గొన్నారు.

Leave a Reply