ముస్తాబాద్ రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

Share this:

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం ప్రవేట్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం పాఠశాలలో ఘనంగా నిర్వహించుకున్నారు భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన 14 నవంబర్ బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మంజుల మాట్లాడుతూ విద్యార్థులకు తమ బాధ్యతలు తెలిసి రావడమే కాకుండా స్వయంగా పాఠాలు బోధించడం వల్ల వారికి ఉపాధ్యాయుల సాధకబాధకాలు స్వయం పరిపాలన దినోత్సవం వల్ల తెలుస్తాయని పేర్కొన్నారు. అనేక మంది ఉపాధ్యాయులు గా మారిన చిన్నారులు ప్రదర్శించిన ప్రతిభ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం ఆటపాటలతో నృత్యాలు నిర్వహించి వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ నరేష్ ఉపాధ్యాయులు పద్మ మంజుల , అపర్ణ , భాను జ్యోతి , లావణ్య, శ్రీ వేణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

Leave a Reply