మేడారంలో మొక్కులు చెల్లించుకున్న తెలంగాణ రాష్ట్ర బేవరిస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్

Share this:

ములుగు (v3news ): ములుగు జిల్లా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా శనివారం మేడారం విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర బేవరిస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం తెలంగాణ రాష్ట్ర బేవరిస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 8 ఎండ్ల కాలంలో 4 దఫాలుగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించడానికి 381 కోట్ల రూపాయలు వ్యయం చేశారని తెలిపారు.ఈ సంవత్సరం జాతర నిర్వహణకు 75 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ఆవర్భావం అనంతరం ముఖ్య మంత్రి కేసీఆర్ శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సమగ్ర అభివృద్ధికి తీసుకున్న చర్యల వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగ లేదని ఆయన అన్నారు.

Leave a Reply