మేడారం మహాజాతర సక్సెస్. వనప్రవేశం చేసిన గిరిజనదేవతలు..ఈవో రాజేంద్రం వెల్లడి

Share this:

తెలంగాణ మహా గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర శనివారం రాత్రి వనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర
ముగిసిందని,మేడారం జాతర విజయవంతమైందని ఆలయ కార్యనిర్వహణ అధికారి రాజేంద్రం,పూజరుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు మీడియాకు తెలిపారు.సాంప్రదాయం ప్రకారం పూజారులు పూజలు చేసిన అనంతరం అమ్మవార్లకు పూజారులు వీడ్కోలు పలికారు.సమ్మక్క చిలుకల గుట్టకు,సారలమ్మ కన్నెపల్లికి, గోవిందరాజు కొండాయికి, పగిడిద్దరాజు పూనగొండ్లకు బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు.నాలుగు రోజుల పాటు సమ్మక్క,సారలమ్మ జాతర ఎంతో వైభవోపేతంగా జరిగిందని,ఈ సారి 1.30కోట్ల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని వారు తెలిపారు.

Leave a Reply