మైనార్టీ సబ్ ప్లాన్, వక్ఫ్ భూముల రక్షణకై ఐక్యంగా ఉద్యమిద్దాం — మహమ్మద్ అబ్బాస్, ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Share this:

నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ ను జమాతే ఇస్లామి హింద్ కార్యాలయంలో సన్మానించారు, ఈ సందర్భంగా నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలకు సబ్ ప్లాన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తామని ఇచ్చిన వాగ్దానం అమలు కాలేదని అన్నారు, రాష్ట్రంలో 26 వేల ఎకరాల వఫ్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం అయ్యాయని భూముల రక్షణకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు, ముస్లిం మైనారిటీల స్థితిగతులపై పై రాజేంద్ర సచార్ కమిటీ నివేదిక, సుధీర్ కమిషన్ రిపోర్ట్ లను బయటపెట్టాయని, వాటి అమలుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు, అనేకమంది ముస్లిం నిరుపేదలు ఇంటి స్థలం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు, దళిత బంధు తరహాలో, మైనారిటీ బందు పథకం ప్రారంభించి మైనార్టీల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి మల్యాల గోవర్ధన్, జమాతే ఇస్లామి హింద్ నాయకులు అన్వర్ ఖాన్, హుస్సేన్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఆవాజ్ జిల్లా కార్యదర్శి మహమ్మద్ మోహిస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply