మోడీ వ్యాఖ్యలపై తిరగబడ్డ ఆర్మూర్ గడ్డ

Share this:

  • వేలాదిమందితో బైక్ ర్యాలీ
  • నింగిని తాకిన నిరసన సెగ
  • కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం
  • తెలంగాణా మీద ఇంతటి విషమా ?
  • ఆర్మూర్ గడ్డ ఉద్యమాల పురిటి గడ్డ
  • బీజేపీ కుట్రలను అడ్డుకుంటాం
  • పీయూసీ చైర్మన్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి

ఆర్మూర్, ఫిబ్రవరి9:-తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలని నిరసిస్తూ ఆర్మూర్ గడ్డ తిరగబడింది. మోడీ డౌన్ డౌన్ అంటూ గర్జించింది. బీజేపీ సాగిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల నిరసన సెగ నింగిని తాకింది. పెల్లుబికిన ప్రజల ఆగ్రహ జ్వాల ల మధ్య జీవన్ రెడ్డి నాయకత్వంలో వేలాదిమంది మానస స్కూల్ నుంచి బైక్ ర్యాలీతో నిరసన గళం వినిపిస్తూ ఆర్మూర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వేలాదిమంది ప్రజలు, టీఆర్ఎస్ శ్రేణులు మోడీ డౌన్ డౌన్ ,బిజెపి తెలంగాణ వ్యతిరేక విధానాలు నశించాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, దేశ్ కీ నేత కేసీఆర్, జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి, అంటూ వేలాది మంది చేసిన నినాదాలతో ఆర్మూర్ దద్దరిల్లింది.
తెలంగాణా మీద ఇంతటి విషమా_
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనను రోల్ మోడల్ గా వర్ణించిన నోటితోటే ఇంతటి విషం గక్కుతున్నావా అంటూ మోడీ వ్యాఖ్యలపై మండి పడ్డారు. “60 ఏండ్లుగా కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అపహాస్యం చేస్తావా? వేరుపడి బాగుపడ్డాం. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే రోల్ మోడల్. అభివృద్ధి లో కొత్త నమూనా అందించిన మహానేత కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వస్తున్న కీర్తి దేశవ్యాప్తంగా వ్యాప్తిస్తున్న భయంతోనే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓటర్లు నిలదీస్తారన్న అభద్రతతో ఓటర్లకు మొహం చూపలేకనే ఇలాంటి తప్పుడు నాటకాలు వేస్తున్నావా? .తెలంగాణ ప్రజ మండింది..మోడీ ఇక నీకు మూడింది. గుజరాత్ లో రాజ ధర్మం పాటించలేదు. ఇపుడు రాజ్యాంగ ధర్మం పాటించడం లేదు. కేసీఆర్ నిలదీస్తున్నారనే అక్కసు తో మోడీ తెలంగాణ ఏర్పాటు నే ప్రశ్నార్థకం చేస్తున్నారు.

ఎన్ డీ ఏ అంటేనే నేషనల్ డిస్రక్టీవ్ అలయన్స్ గా తయారైంది.


కేసీఆర్ తెలంగాణ ను కళ్ళు చెదిరే రాష్ట్రం (కేసీఆర్) లా మార్చారు. నోట్ల రద్దు చేసినంత సులభం కాదు.వచ్చిన తెలంగాణ ను రద్దు చేయడం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ను నువ్వు గుర్తించకపోతే నిన్ను ప్రధానిగా మేం గుర్తించం. తెలంగాణ జోలికి వస్తే బీజేపీ ని నెలకేసి కొడతాం.తెలంగాణ ఎవడబ్బ సొమ్ము కాదు. గతం లో రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ను రాష్ట్రం గా తిరిగి ఇచ్చారు. మోడీ చరిత్ర తెలుసుకోవాలి.మోడీ ది నోరు కాదు మోరీ.నరేంద్ర మోడీ కాదు నరేంద్ర మోరీ. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే మోడీ మాత్రం ఉన్న రాష్ట్రాలను తగ్గిస్తున్నారు. తెలంగాణ ను కూడా మోడీ కాశ్మీర్ లా మార్చే కుట్ర చేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతోంది” అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు.బీజేపీ ఎన్ని నంగనాచి కబుర్లు చెప్పినా అది పచ్చి తెలంగాణ విద్రోహ పార్టీ.ఒక ఓటు వేస్తే రెండు రాష్ట్రాలు ఇస్తామని 1998లోనే బీజేపీ తీర్మానం చేసి నమ్మబలికింది.వాజపేయి నాయకత్వంలో బీజేపీ 2004 దాకా అధికారంలో ఉండి కూడా తెలంగాణపై నోరు మెదపని అవకాశవాద పార్టీ అది. అప్పుడు తెలంగాణ ఇవ్వకుండా వేలాది మంది తెలంగాణ యువకుల బలిదానాలు చేసుకోవడానికి కారణం బీజేపీ. రాజధాని కలిగి ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరడం ఏమిటి అని అప్పటి ఉప ప్రధాని అద్వానీ హేళన చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా బీజేపీది వెనుక సీటే. ఎప్పుడూ వీధుల్లోకి వచ్చి తెగించి కొట్లాడింది లేదు. తెలంగాణ కోసం రాజీనామా చేద్దామంటే చేయకుండా పారిపోయిన చరిత్ర కిషన్ రెడ్డిది. 2013లో కూడా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వాలని నిర్ణయించిన తర్వాతనే తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ తెలంగాణకు మద్దతు ప్రకటించింది. 2014లో తెలంగాణ ఏర్పడకపోయి ఉంటే నరేంద్రమోడీ తెలంగాణ ఇచ్చేవాడే కాదు.ఎందుకంటే రాష్ట్రాల విభజనకు మోడీ వ్యతిరేకం. ఉత్తర ప్రదేశ్ ను విభజించాలని అన్ని పార్టీలు తీర్మానం చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తెలంగాణ పట్ల బీజేపీ తన వ్యతిరేకతను దాచుకోలేదు.నరేంద్రమోడీ అధికారంలోకి రాగానే తెలంగాణకు సంబంధించిన ఏడు మండలాలను, సుమారు 211 గ్రామాలను బలవంతంగా తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రలో కలిపేశారు.భద్రాచలం, అశ్వారావుపేట, పినపాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఇప్పుడు అరవై శాతం ఓటర్లతో నియోజకవర్గాలుగా కొనసాగుతున్నాయి.పొద్దున్న లేస్తే రామ భజన చేసే బీజేపీ భద్రాద్రి రాముడిని గోదాటిలో ముంచేసింది.2014 ఎన్నికల్లోనే నరేంద్ర మోడీ తెలంగాణపై తన అక్కసును బయటపెట్టారు.తల్లిని చంపి పిల్లను బయటికి తీశారు అంటూ తెలంగాణ ఏర్పాటును ఎగతాలి చేస్తూ ఎల్‌బీ స్టేడియం బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ తర్వాత కూడా తెలంగాణపట్ల అన్ని అంశాల్లోనూ శత్రు భావంతోనే వ్యవహరించారు.రాష్ట్ర విభజన చట్టంలో రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని పొందుపర్చారు.విభజన చట్టం ప్రకారం పార్లమెంటులో సవరణ బిల్లు తెచ్చి నియోజకవర్గాల పునర్విభజన చేసి తెలంగాణలో 153, ఆంధ్రలో 225 నియోజకవర్గాలు ఏర్పాటు చేసి ఉండవచ్చు.రాత్రికి రాత్రే సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఆంద్రప్రదేశ్ కు ధారాదత్తం చేసి తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టారు.అలా సవరణ బిల్లు తెచ్చే జమ్ము కాశ్మీరులో నియోజకవర్గాల పునర్విభజన చేపడుతున్నదన్న విషయం అందరికీ తెలుసు. కానీ తెలుగు రాష్ట్రాలపై కక్షతోనే బీజేపీ కొత్త నియోజకవర్గాల ఏర్పాటును పక్కన పడేసింది. తమకు రాజకీయ అవసరం ఉంటే తప్ప బీజేపీ ఏపనీ చేయదని ఈ విషయం స్పష్టం చేస్తుంది. తెలంగాణ 2014కు ముందు అరవై ఏళ్లపాటు వివక్ష కారణంగా వెనుకబడిపోయిందని, ఆ వివక్ష అంతంకోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని అందరికీ తెలుసు. అయితే తెలంగాణకు కొత్తగా ఎటువంటి ప్రాజెక్టులు ప్రకటించలేదు. ఆంధ్రకు పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన కేంద్రం తెలంగాణకు మొండి చేయి చూపించింది. వ్యవసాయికంగా వెనుకబడిన తెలంగాణలో అనేక ప్రాజెక్టులు చేపడితే ఏ ఒక్క ప్రాజెక్టుకు ఆర్ధిక సహాయం అందించలేదు. పైగా ప్రాజెక్టులకు ఇప్పుడు అవరోధాలు కల్పించడానికి చేయని ప్రయత్నం లేదు.తెలంగాణ ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రాజెక్టులు కట్టుకుని పొలాలకు నీళ్లు మళ్లించుకుంటే తీరా పంటలు చేతికి వచ్చే సమయానికి వరికొనబోమని ప్రకటించి చేతులు దులుపుకుంది. వ్యవసాయ రంగానికి అన్ని రకాలుగా మద్దతు ఇవ్వాల్సిన కేంద్రం పూర్తిగా బాధ్యతల నుంచి తప్పించుకుంది.సేద్యాన్ని నాశనం చేసే నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులు ఆందోళన చేసిన తర్వాత ఉపసంహరించుకుంది.ఐటీ రంగంలో తెలంగాణ అనతికాలంలోనే అద్భుత ప్రగతిని సాధించింది. ఎవరూ ఊహించని విధంగా ఐటీకి కేంద్రమైంది. అయితే ఐటీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు, 2.19 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించేందుకు ఐటీఐఆర్ ఇస్తామని కేంద్రం 2013లోనూ, ఆ తర్వాత 2016లోనూ హామీ ఇచ్చింది.ఏమైందో ఏమో కానీ ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు.కానీ 10,500 కోట్ల పెట్టుబడులతో గుజరాత్ లో, ఢిల్లీ-ముంబై కారిడార్ లో పెట్టుబడి జోన్లను అనుమతించింది.


తెలంగాణ ఏం పాపం చేసిందని ఒక్క బీజేపీ నాయకుడూ మాట్లాడడు.ఆంధ్ర ప్రాంతంలో 11 జాతీయ స్థాయి విద్యాసంస్థలను ప్రారంభించిన కేంద్రం తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వమంటే ఇవ్వలేదు.స్వయంగా ప్రకటించిన గిరిజన విశ్వవిద్యాలయం ఇంకా రూపుదాల్చలేదు.బయ్యారంలో స్టీలు కర్మాగారం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చిన బీజేపీ ఇప్పుడా ఊసే లేదని చెబుతున్నది.కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ని గంగలో కలిపారు అని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ కు ద్రోహం చేస్తున్న బీజేపీ ని ఈ గడ్డ మీద నుంచి తరిమి కొడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

Leave a Reply