యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అక్కంపల్లిలో రెచ్చి పోయిన చైన్ స్నాచర్

Share this:

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున దొంగలు రెచ్చిపోయారు.ద్విచక్రవాహనంపై గ్రామంలోకి ప్రవేశించి ఇల్లు వాకిలి శుద్ధి చేసుతున్న మహిళ మెడలో నుంచి నాలుగు తులాల తాళిబొట్టు ను లాక్కెళ్లిన ఘటన జిల్లాలో కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అక్కంపల్లి గ్రామానికి చెందిన దేశిరెడ్డి కమలాకర్ రెడ్డి కల్యాణి దంపతులు అక్కంపల్లి గ్రామం లో నివసిస్తుంటారు.ఈ గ్రామం వలిగొండ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఈరోజు తెల్లవారుజామున కల్యాణి తన ఇంటి ముందు వాకిలి శుద్ధి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఇక్కడ బోరు ఎక్కడ వేస్తున్నారని అడుగగా కల్యాణి నాకు తెలియదు అనటంతో ఈ దారి ఎటు వెళుతుంది అని అడ్రస్ అడిగినట్లుగా ఆమె దృష్టి మరల్చి ఆమె మెడలో నుంచి నాలుగు తులాల బంగారు పుస్తెలతాడు ను లాక్కెళ్లి వెళ్ళిపోయినట్లు తెలిసింది. అంతలో ఆమె వారిని వావరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.దాంతో ఆ పుస్తెల తాడుతో చోధకులు ఉదయించారని ఆమె తెలిపింది.ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగల కొరకు గాలిస్తున్నట్లు సమాచారం.పట్టణ కేంద్రానికి కూతవేటు దూరంలో ఈ చైన్ స్నాచింగ్ జరగటం ఇంట్లో ఉన్న మహిళలకు కూడా భద్రత లేకపోవడంతో అక్కడి ప్రజలు ఆంద్రోళన వ్యక్తం చేస్తున్నారు.ఆ గ్రామంలో యథేచ్ఛగా బెల్టు షాపులను నిర్వహిస్తున్నారని వాటిని నిర్మిలించకపోవటం,పోలీసుల పెట్రోలింగ్ లాంటి లోపంతోనే ఈ దోపిడీ జరిగిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.

Leave a Reply