రాధే రాధే గోశాల లో భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం

Share this:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరువలో గల రాధే రాధే గోశాల లో భారతీయ జనతా పార్టీ జిల్లా స్థాయి శిక్షణ శిబిరం ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు విద్యసాగర్ , వక్తగా ఉపాధ్యాయులు విజయ్ మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా విద్యాసాగర్ మాట్లాడుతూ…. శిబిరంలో పాల్గొంటున్న నాయకులకు దిశ నిర్ధేశం చేశారు. ప్రజల సమస్యలను స్వంత సమస్యగా భావించిన వాడే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడని అన్నారు.

రాజకీయాల్లో అనుభవం కాదు నాయకత్వ లక్షణం ముఖ్యం

భాధ్యులను… ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ .. రాజకీయాల్లో నాయకులకు కావలసింది అనుభవం కాదు రాజకీయాల్లో కావాల్సింది నాయకత్వ లక్షణం అన్నారు. రాజకీయాలు అంటే కేవలం పారతలు, ధర్నాలు కాదు అన్నారు. శిక్షణ తరగతుల్లో పాల్గొనడం వల్ల మనకు ఒక గొప్ప అవకాశం లభిస్తుంది అది… అనుభవజ్ఞులలైన నాయకుల మార్గదర్శనం అన్నారు. దేశ ప్రధాన మంత్రి కూడా ఒక సాధారణ కార్యకర్తగా శిక్షణ తరగతులకు హాజరుకావడం కేవలం ఒక్క మన బీజేపీ పార్టీ లోనే మనం చూడగలం అన్నారు. భారతీయ జనతా పార్టీలో నేను కొనసాగడం మన అందరి అదృష్టం అన్నారు.

వక్తలు శ్రీ విజయ్ , RSS ప్రముఖ్ శ్రీనివాస్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న నాయకులకు దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వాటి పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఆదినాథ్, వేణుగోపాల్, లోక ప్రవీణ్ రెడ్డి, దినేష్, లాలా మున్నా.. మహిళా నాయకులు, మండల నాయకులు, మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply