రామగుండం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఉపకరించే సమగ్రమైన మాస్టర్ ప్లాన్ – 2021-రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

Share this:

రామగుండం నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ఉపకరించే సమగ్రమైన మాస్టర్ ప్లాన్ – 2021 తమారు చేసుకుందామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో మాస్టర్ ప్లాన్ ముసాయిదా పై జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ…2041 వరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని ఎమ్మెల్యే సంబంధిత కన్సల్టెన్సీని కోరారు.
ఒకనాడు కేవలం సింగరేణి సంస్థ మాత్రమే ఉండేదని, నేడు సింగరేణితో పాటు ఎన్టీపీసీ,ఆర్ఎఫ్ సిఎల్, జెన్కో వంటి సంస్థలతో పాటు 2022వ సంవత్సరంలో ప్రారంభం కానున్న మెడికల్ కళాశాలతో ఈ ప్రాంతం మరింత విస్తరించనున్నదని, పారిశ్రామికంగా అభివృద్ధి చెందనుందని అన్నారు. ఐదు లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకొని, ఆవాస ప్రాంతాలు, వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలు, రోడ్లు, మిగులు భూముల వినియోగ ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని, మంచిర్యాల జిల్లా వైపు, పెద్దపల్లి జిల్లా కేంద్రం వైపు అవుటర్ రింగ్ రోడ్డులాంటి బైపాస్ రోడ్ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పారిశ్రామిక ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్, గురుకుల ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేయవలసి ఉన్నా, స్థలాభావం వల్ల ఏర్పాటు చేయలేకపోతున్నామన్నారు. సింగరేణి, ఎన్టిపిసి, ఆర్ఎఫ్ సిఎల్, జెన్కో వద్ద వినియోగంలో లేని మిగులు భూములను తిరిగి రెవెన్యూ శాఖకు అప్పగించి, సహకరించినట్లయితే భవిష్యత్ లో ఆయా నిర్మాణాల కోసం, మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయవచ్చన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించి, పారిశ్రామిక ప్రాంతాన్ని మరింత సుందరీకరణ చేయడానికి కృషి చేస్తామన్నారు. అమృత్ పథకం అమలులో భాగంగా డిడిఎఫ్ కన్సల్టెన్సీ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించగా, ఇంకా ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కమీషనర్ సుమన్ రావు అధికారులు మైఖేల్ శ్రీనివాస్ రావు తో తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply