రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి-ఏబీవీపీ ఎల్బినగర్ విభాగ్

Share this:

ఎబివిపి ఎల్ బి నగర్ విభాగ్ లోని దిల్సుఖ్నగర్ నగరంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించి నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా విభాగ్ కన్వీనర్ అక్యారి మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఏడేళ్లు గడుస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకుండా కేవలం మాయమాటలతో మభ్యపెడుతూ అమాయకపు నిరుపేద నిరుద్యోగుల జీవితాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. PRC నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 191000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ కారుపోతుల రేవంత్, దిల్సుఖ్నగర్ నగర కార్యదర్శి కుంచాల సాయిరాం, సుమంత్, రంజిత్, సూర్య మోహన్, అలేఖ్య ,అంజలి, సుష్మా తదితరులు పాల్గొన్నారు

Leave a Reply