యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రుణ విస్తరణ కార్యక్రమం

Share this:

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ఏ కె ప్యాలెస్లో జిల్లా లీడ్ కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో రుణ విస్తరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెనరా బ్యాంక్ డి జీ ఎం కన్మౌళి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి బ్యాంకులో మీకు కావాలిసిన ఋణాలు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంక్ లలో అందుబాటులో ఉంటాయి.మీరు వాటిని సద్వినియోగం చేసుకోవాలనిఅన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా డి సి సి బి చైర్మన్ గొంగిడి.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం కంటే ప్రస్తుతం బ్యాంక్ రుణాల వడ్డీ రేట్లు తగించం జరిగింది.అన్ని బ్యాంకుల కన్నా మా బ్యాంకు ఋణాలలో ముందున్నది అవసరాన్ని బట్టి రుణాలు తీసుకొవలని కోరారు. లబ్ధిదారులు బ్యాంకుల్లో అర్జీ పెట్టుకున్న మహిళ సంఘాలకు , కార్ లోన్ , ఎడ్యుకేషన్ లోను , పర్సనల్ లోన్ , గృహ నిర్మాణాల లోన్ , వ్యవసాయ రంగానికి సంబంధించిన వారందరికీ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో యన్. డి. సి. సి.బి. చైర్మన్ గొంగిడి.మహేందర్ రెడ్డి,స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ డి. జి. ఎం. సుదర్శన్,కెనరా బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ ఆఫీస్ కనిమొళి,కెనరా బాంక్ రీజినల్ మేనేజర్ వరంగల్ సి.వి.రాంబాబు,భువనగిరి కెనరా బ్యాంక్ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రామకృష్ణ, జిల్లా పరిశ్రమల కమిటీ జి యం. శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply