రైతులను మోసం చేస్తున్న కేసీఆర్

Share this:

రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం,ఇక్కడ ఉన్న ఖాళీ ప్రదేశంలో గ్రామ రైతులు పండించిన వరి ధ్యానాన్ని తీసుకొచ్చి కుప్పలుగా ధాన్యపు రాసులను పోస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థలం దేవాదాయశాఖ వారికి సంబంధించిన భూమి వారు క్వింటాకు కొంత కమిషన్ తీసుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను ఎపుడు కొంటారో అని ఎదురు చూడాల్సిన దుస్థితి వచ్చింది. గతంలో సన్న రకాల పంట వేయమన్న ప్రభుత్వం అది కొనకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేని దుస్థితిలో అమ్ముకోవాల్సి వచ్చిందని విలపించారు. వందలాది రైతులు ధాన్యం ఇలా ఆరుబయట అనువుగా లేని ప్రదేశంలో ఆరబెట్టడం వల్ల ఎప్పుడు వర్షం వస్తుందోనన్న భయంతో జీవిస్తున్నారు. రాత్రిపూట ఏదైనా అనుకోకుండా వర్షం వస్తుందేమో అని ఆందోళనతో కంటి నిండా నిద్రపోలేని దుస్థితి ఏర్పడింది. దళారులను బతికించడానికి కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మోసపూరిత కాలయాపన నిజంగా భారత దేశ చరిత్రలోనే లిఖించదగ్గది. వందలాది ఎకరాలున్న వాడికి ఇచ్చే బదులు రైతుబంధుతో ధాన్యం నిలువ ఉంచే ఒక గోడౌన్ నిర్మించవచ్చు కదా అని రైతులు వాపోయారు. మాకు సరైన మద్దతు ధర ఇస్తే రైతుబంధు ఎవడికి కావాలి ? రైతుల దగ్గర కొన్న ధాన్యానికి వెంటనే డబ్బు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం వుంది. ప్రభుత్వ ఖజానా పై శ్వేత పత్రం విడుదల చేయాలి. అక్కడ రైతులు ఇబ్బందులు పడుతుంటే ఒక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధి పలకరించే పాపాన పోలేదు.
మద్దతు ధర సంగతి దేవుడెరుగు కనీసం వడ్లు కొనే పరిస్థితి లేదు. కెసిఆర్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను వెంటనే కొని గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. కొనుగోళ్లు వెంటనే ప్రారంబించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు కవిత,ముత్యాల రమేష్, నకిరేకంటి సతీష్ , రాజు , కిరణ్ , శ్రీకాంత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply