లక్డారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Share this:

పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో వెలసిన అతి పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలయ ఆవరణలో ఆలయ ప్రాకార మరియు గాలి గోపురం నిర్మాణ పనుల పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి దేవాలయం అభివృద్ధికి గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజల సూచనలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సువర్ణ మాణిక్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పాల్గొన్నారు

Leave a Reply