వడ్ల కల్లాల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దుద్దిళ్ళ

Share this:

👉ఈరోజు మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో *మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు * మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు

👉వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు

👆కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఖానాపూర్ గ్రామ రైతులు వర్షాలు కురిసినప్పుడు తీవ్రమైన పంట నష్టం వాటిల్లుతుంది ముంపుకు గురయ్యే భూములను రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలి

👉ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు మొదలుపెట్టి కనీస మద్దతు ధర ఇవ్వాలి

👉కొనుగోలు కేంద్రాలలో రైతు ధాన్యాన్ని అమ్మిన తర్వాత మిల్లర్ లతో సంబంధం లేకుండా ఇచ్చిన రిసిప్ట్ ద్వారా డబ్బుల కోసం ఎదురు చూడాలి తప్ప మిల్లర్ల చుట్టూ తిరగడం ఈ ప్రభుత్వo చేతకాని తనానికి నిదర్శనం

👉కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రం లో రైతుకు మిల్లర్ తో సంబంధం లేకుండా నేరుగా ఖాతాలోకి డబ్బులు వచ్చే ఈ విధంగా కృషి చేశాము

👉రైతుల ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి ఉదాహరణకు ఐదు వందల బస్తాలు మిల్లర్ వద్దకు చేరితే మిల్లర్ తరుగు పేరుతో 50 బస్తాల 30 బస్తాలు కట్ చేసి రైతులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు

👉ఈరోజు ఈ ప్రభుత్వ చేతగానితనం వల్ల మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితి ఏర్పడింది

👉ఒక పటిష్ఠమైన నియంత్రణ లేకపోవడం వల్ల రాష్ట్ర రైతాంగం ఇబ్బంది పడుతున్నారు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి

👉వరి వేస్తే ఊరి అని చెప్పడం కాదు

👉ప్రత్యామ్నాయ పంటలు వేయమని ప్రభుత్వాలు రైతులను సూచిస్తున్నాయి కానీ రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తారు ఏలా కొనుగోలు చేస్తారు కనీస మద్దతు ధర ఎంత ప్రకటిస్తారు పండించిన పంట నష్ట పోకుండా నమ్మకం కల్పించాలి అలా కల్పించకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ధర్నాల పేరుతో డ్రామాలు చేస్తున్నారు

👉కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలలో తెలంగాణ రైతన్నలు అరిగోస పడుతున్నందుకు నిరసనగా తాము పోరాడుతున్నామన్నారు

👉అన్నదాతలు కన్నీళ్లు పెడుతుంటే బజార్లో బిజెపి, టిఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని దొంగ డ్రామాలు ఆడుతున్నారు

👉రైతులను కలిసి ధైర్యం చెప్పి చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టామని భరోసా ఇచ్చారు

👉అకాల వర్షానికి తడిసిన ధాన్యం తేమ తో సంబంధం లేకుండా కొనాల్సిందే

👉కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు నల్ల చట్టాలకు నాడు టీఆర్ఎస్ ఎంపీలు ఓటు వేశారు రాష్ట్ర అసెంబ్లీలో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరినప్పటికీ తీర్మానం చేయకుండ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బయటకు పంపించిన విషయం వాస్తవం కాదా

👉రాష్ట్రంలో కూడా రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్ కు గుణపాఠం చెప్తారని ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ కూడా దిగి రాక తప్పదు అని మాజీ మంత్రి వర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నరు

Leave a Reply