వన దేవతల జాతరను కన్నుల పండుగ నిర్వహిస్తాం- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

Share this:

మిని మేడారం గా పిలువబడే గోదావరినది తీరంలో ఫిబ్రవరి మాసంలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను వైభవంగా నిర్వహిస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. మంగళవారం సమ్మక్క సారలమ్మ జాతర కోసం 50 లక్షల వ్యయంతో నిర్మించే రోడ్డుకు ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షాలది మంది తరలివస్తరని వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఎర్పాటు చెస్తున్నమన్నారు. రామగుండం మున్సిపాలిటీ, ఎన్టీపీసీ, సింగరేణి ఆర్.ఎఫ్ సి.ఎల్ సంయుక్తంగా జాతర ఎర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో జాతర ప్రారంభమైన సందర్భంలో గౌరవ రాష్ట్ర సంక్షేమ శాఖమాత్యులు కోప్పుల ఈశ్వర్ బాధ్యులుగా వ్యవహరించారన్నారు. సమ్మక్క సారలమ్మ జాతర మెరుగైనా వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్ కుమ్మరి శ్రీనివాస్ నాయకులు తానిపర్తి గోపాలరావు అచ్చే వేణు కలువల సంజీవ్ బోడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply