వికారాబాద్ జిల్లా రైతుల కలాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు

Share this:

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని అంతారం పుట్టా పహాడ్ గ్రామంలో పొలాల దగ్గరికి వెళ్లి రైతుల కలాల్లో ఉన్న వరి ధాన్యాన్ని పరిశీలిస్తున్న మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు జిల్లా డి సి సి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి వరి ధాన్యం కొనుగోలులో రైతుల యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులు మాట్లాడుతూ నెలరోజులైనా ఇప్పటి వరకు వరి ధాన్యాన్ని కోరడం లేదని రైతులు ఆవేదనతో తెలియజేశారు దీంతో హనుమంతరావు డి సి ఓ అధికారులతో మాట్లాడుతూ రైతుల యొక్క వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం కొనుగోలు ఈ విషయంలో ద్వంద వైఖరి అవలంబించడం వల్ల ఆరునలు కష్టపడి పండించిన వరి ధాన్యము కొనక పోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వర్షాలు పడడంతో వరి ధాన్యం పాడవుతుందని అధికారులు వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షుడు భీమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భరత్, వెంకట్ రాములు, అంజయ్య గౌడ్, కొండయ్య, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply