విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

Share this:

రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో వాసవి క్లబ్ హైదరాబాద్ ప్రతినిధి అనుముల శ్రీనివాస్ గారి సమన్వయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 130 నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందని బెస్ట్ సేవ సొసైటీ ఆర్గనైజర్ వేముల సైదులు తెలిపారు.
ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రతినిధి అనుముల శ్రీనివాస్ గారు మాట్లాడుతూ పేద విద్యార్థుల కోసం దాదాపు రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగిందని విద్యార్థుల భవిష్యత్తు కోసం వివిధ రకాల సహాయ సహకారాలు వాసవి క్లబ్ నుండి మా వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు
అలాగే పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఎం.నరసింహ గారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులకు బుక్స్ బహూకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యస్. పాండరి , రాజన్ బాబు, రవికుమార్, రమేష్ , భద్రయ్య చిల్ల నరేష్ , కూరెళ్ల ఉపేంద్ర చారి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply