విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి

Share this:

కరెంటు షాక్ తగిలి కరెంటు పోల్ పైనే ప్రాణాలు వదిలిన యువకుడు…

చింతపల్లి(V3News): నల్గొండ జిల్లా చింతపల్లి మండలంలో యాచారం కృష్ణ(26)అనే యువకుడు కరెంటు కలెక్షన్ సరిచేయడానికని కరెంటు పోల్ ఎక్కగా కరెంటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు….కరెంటు బిల్లులు కొట్టడానికని నెలకు కొంత ఇచ్చేట్టు మాట్లాడుకొని అధికారులు కృష్ణను పెట్టుకున్నారు….
అధికారులు నిర్లక్ష్యంతో ఇతన్ని పోల్ ఎక్కించడమే కాకుండా తాను దిగకముందే కరెంటు ఆన్ చేయడంతో కృష్ణ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది….
కృష్ణకు సంవత్సరం క్రితమే పెళ్ళి కాగా ఇపుడు తన భార్య నిండు గర్భవతి…..ఐదుగురు సంతానంలో నలుగురు అక్కల తర్వాత కృష్ణ ఐదో సంతానం….
అల్లారుముద్దుగా పెరిగిన కొడుకు ఇలా చనిపోవడంతో తల్లి తండ్రుల ఆవేదన మరియు తన భర్తను విగతజీవిగా చూస్తూ కృష్ణ భార్య రోదనలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి…

Leave a Reply