విశాఖలో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ

Share this:

విశాఖ జిల్లా హుకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ కి చెందిన పంది పెట్టు మరియు చింతకొట్టు గ్రామాలకు స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ రీజినల్ మేనేజర్ ఇండిపూడి సుధాకర్ మరియు ఏజెన్సీ ఇన్చార్జి అయ్యప్ప , వారి బృందం ఆధ్వర్యంలో స్మార్ట్ విలేజ్ గా ఎంపిక చేసి తడి పొడి చెత్త వేయుటకు చెత్త బుట్టలు అంగన్వాడి సెంటర్ పిల్లలకు కావలసిన ఆట వస్తువులు మరియు పలకలు, పెన్నులు, పెన్సిలు ,అలాగే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లలకు అవసరమైన వస్తువులు గ్రామ యువతకు వాలీబాల్ కిట్ , ANMకు, మెడికల్ కిడ్స్ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజెన్సీ ఇన్చార్జి అయ్యప్ప మాట్లాడుతూ వెనుకబడిన టువంటి గ్రామాలలో సదుపాయాలు కల్పించేందుకు వారి బాగోగులు తెలుసుకొని అభివృద్ధి దిశగా అడుగులు వేయించేందుకు మా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు .ఈ కార్యక్రమనికి హుకుంపేట మండల ఎక్స్క్యూటివ్ అర్లబు నాగేశ్వరరావు గారు కొట్నపల్లి గ్రామ సర్పంచ్ బొంజుబాబు, ఎంపిటిసి బాలకృష్ణ, తడిగిరి ఎంపిటిసి భీమలింగేశ్వరరావు, పందిమెట్టు గ్రామ ఉపాధ్యాయులు కొండబాబు,స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ బృందం తదితరులు పాల్గొన్నారు

Leave a Reply