విశ్వబ్రాహ్మణుల హక్కులకై పాటు పడతా-ఎదులాపురం వెంకటేష్ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు

Share this:

డిసెంబర్ 18 విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంగం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా పెద్దపల్లి జిల్లా, అంతర్గాం మండలం పొట్యాల గ్రామం ఎదులాపురం వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఎదులాపురం వెంకటేష్ మాట్లాడుతూ తనపైన నమ్మకం ఉంచి తనను రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోజు బిక్షపతి చారి గారికి అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులు గా నియమించాడానికి సహకరించిన భీమోజు సురేందర్ చారి ,పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుల కి కృతజ్ఞతలు తెలుపుతూ ,తనపై నమ్మకంతో అంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు తాను విశ్వబ్రాహ్మణుల హక్కులకై ఎప్పుడూ ముందుండి కృషి చేస్తానని, ముందు ముందు రోజుల్లో రాష్ట్ర నాయకులు సమన్వయంతో ముందుకు సాగుతానని, వెంకటేష్ తెలిపారు. ఇందులో చల్లోజుల స్వామి, అంతర్గాం మండల్ అధ్యక్షులు, కాగితాల శ్రీనివాస్ పాలకుర్తి మండల అధ్యక్షులు, ఎదులాపురం చంద్రమౌళి జిల్లా కార్యదర్శులుగా నియమించడం జరిగింది.

Leave a Reply